బీజేపీతో పొత్తు.. పవన్ కు సిగ్గులేదా ?
1 min readపల్లెవెలుగు వెబ్: విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ కు సిగ్గు లేదా ? అంటూ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైకాపాకు 90 వేల మెజార్టీ ఇస్తే.. బీజేపీకి ప్రజలు గడ్డిపెట్టారని అన్నారు. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పారు. బీజేపీ పై పెట్రోల్ పోసి.. టీడీపీ పై డీజిల్ పోసి జనం తగలబెట్టారని వ్యాఖ్యానించారు. జనసేన ఓ పనికిమాలిన పార్టీ అని అన్నారు. బీజేపీ అధికారం ఉన్నచోట, లేనిచోట చిత్తుగా ఓడించారని అన్నారు.