ఒక్క రోజే 44 లక్షల మంది రాజీనామా !
1 min readపల్లెవెలుగు వెబ్ : అమెరికాలో ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వరుసగా రెండో నెలలో భారీ సంఖ్యలో అమెరికన్లు ఉద్యోగాలు వదులుకున్నారు. ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలు వదులుకోగా.. సెప్టంబర్ లో 44 లక్షల మంది ఉద్యోగాలు వదులుకున్నారు. ఈ మేరకు అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడించింది. కొత్త అవకాశాల కోసమే కార్మికులు ప్రస్తుత ఉద్యోగం వదిలేస్తున్నారని, అధిక వేతనం లభించే మార్గాల వైపు దృష్టిసారిస్తున్నారని తెలుస్తోంది. భారీగా ఉద్యోగాలు వదులుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఖాళీల సంఖ్య భారీగా పెరుగుతోంది. రిటైలర్లకు, డెలివరీ కంపెనీలకు భారీగా ఉద్యోగులు అవసరమవుతున్నప్పటికీ ఉద్యోగార్థలు లభించడంలేదు.