ఏపీకి మరో వాయు‘గండం ’
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆది, సోమవారాల్లో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. థాయిలాండ్, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం…పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 15నాటికి ఆగ్నేయ బంగాళఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. ఈనెల 18న ఏపీ తీరానికి చేరే అవకాశం ఉంది. ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టత రావాల్సి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం..అక్కడి నుంచి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బంగా వరకు ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు.