ఏపీకి మరో వాయుగుండం ముప్పు
1 min read
పల్లెవెలుగు వెబ్: ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం.. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అది ఈనెల 18న ఏపీలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఎక్కడ తీరం దాటుతుందో ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. ఇచ్చాపురంలో 15.8, కవిటిలో 12.3, పలాసలో 12.3, సోంపేట 10.4, కంచిలి 9.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.