PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అట్టహాసం.. ప్రమాణ స్వీకారోత్సవం..

1 min read
నందికొట్కూరు, చైర్మన్​ ప్రమాణ స్వీకారం, దాసి సుధాకర్​ రెడ్డి,

నందికొట్కూరు, చైర్మన్​ ప్రమాణ స్వీకారం, దాసి సుధాకర్​ రెడ్డి,

నందికొట్కూరు చైర్మన్‌గా దాసి సుధాకర్ రెడ్డి
– వైస్​ చైర్మన్​గా మొల్ల మహబూబ్ రబ్బాని
పల్లె వెలుగు వెబ్​, నందికొట్కూరు : ‌నందికొట్కూరు పురపాలక సంఘం చైర్మన్‌గా దాసి సుధాకర్ రెడ్డి ను వైకాపా అధిష్ఠానం ఎంపిక చేసింది. బుధవారం వైకాపా నియోజక వర్గ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎన్నికైన 27 మంది వైసీపీ కౌన్సిలర్లతో మంతనాలు జరిపారు. ఛైర్మన్‌గా దాసి సుధాకర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు.16 వ వార్డు నుంచి అత్యధిక మెజారిటీ తో గెలిచిన అతను చైర్మన్​ పగ్గాలు చేపట్టారు. గురువారం నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు సభా అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్​, వైస్‌ చైర్మన్​ ఎన్నికతోపాటు, కౌన్సిలరులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం11.45 నిమిషాలకు సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. 29 వార్డు సభ్యులలో 21 మంది వైసీపీ సభ్యులు 7 మంది స్వతంత్ర సభ్యులు , టిడిపి సభ్యులు ఒకరు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. అదికారులు సభ్యులందరిచే ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మొట్టమొదట 22 వార్డు సభ్యురాలు ఆర్షపోగు ప్రశాంతిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ్యులు ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. 29 మంది వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ లను సభ్యులు ఎన్నుకున్నారు. చైర్మన్ అభ్యర్థిగా 16 వార్డు సభ్యుడు దాసి సుధాకర్ రెడ్డి పేరును 26 వార్డు సభ్యురాలు మందడి వాణి ప్రతిపాదించగా 17 వార్డు సభ్యుడు అబ్దుల్ రవూప్ బలపరిచారు. సభ్యులందరూ చైర్మన్ అభ్యర్థిని బలపరచడంతో దాసి సుధాకర్ రెడ్డి చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా వైస్ చైర్మన్ పదవి కి 25 వ వార్డు సభ్యుడు మొల్ల మహబూబ్ రబ్బాని పేరును 1 వ వార్డు సభ్యుడు కాటేపోగు చిన్న రాజు ప్రతిపాదించగా 23 వ వార్డు సభ్యుడు చెరుకు సురేష్ బలపరిచారు. వైస్ ఛైర్మన్ గా మొల్ల మహబూబ్ రబ్బాని ఎన్నిక ఏకగ్రవం అయినట్లు అధికారులు ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్ లకు స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసులు ,మున్సిపల్ కమిషనర్ అంకిరెడ్డి లు ధృవీకరణ పత్రాలను అందజేశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయ కర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, మైనారిటి నాయకులు తాటి పాడు మొల్ల మహబూబ్ సాహెబ్, వైసీపీ నాయకులు చంద్రమౌళి , మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వా శివ రామకృష్ణా రెడ్డి లు నూతన పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ నాగరాజ రావు, రూరల్ సీఐ ప్రసాద్ అధ్వర్యంలో ఎస్సైలు చంద్ర బాబు, వెంకట రెడ్డి, తిరుపాలు, శ్రీనివాసులు మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించారు.
చైర్మన్​ సుధాకర్​ రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసులు

About Author