కేరళలో టీచర్ల వస్త్రధారణపై వివాదం
1 min readపల్లెవెలుగు వెబ్: కేరళలో టీచర్ల వస్త్రధారణపై వివాదం నెలకొంది. మహిళా టీచర్లు తప్పనిసరిగా చీర కట్టుకుని రావాలని ప్రైవేట్ విద్యా సంస్థలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీంతో టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తులపై ఇలాంటి ఆంక్షలు విధించడం దారుణమన్నారు. ఈ విషయం కాస్తా విద్యాశాఖ మంత్రి బిందు దృష్టికి వెళ్లింది. కేరళలో టీచర్ల వస్త్రధారణపై ఎలాంటి ఆంక్షలు లేవని… పలానా దుస్తులే ధరించాలని చెప్పడానికి ప్రైవేట్ యాజమాన్యాలకు ఏం హక్కు ఉందని ఆమె ప్రశ్నించారు. ప్రతి టీచర్ తమకు నచ్చిన దుస్తులను ధరించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ ఏ ప్రైవేట్ స్కూల్, కాలేజ్ అయిన చీర మాత్రేమే కట్టుకు రావాలని ఆదేశిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి బిందు హెచ్చరించారు. ఇటు, రాష్ట్ర విద్యాశాఖ వస్త్రధారణపై సర్క్యులర్‌ను జారీ చేసింది. టీచర్లు తమకు నచ్చిన దుస్తులను వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది. ఎలాంటి ఆంక్షలూ అమల్లో లేవని పేర్కొంది.