బ్యాంకులకు NPA షాక్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. నాన్ ఫర్మార్మింగ్ అసెట్స్ గుర్తింపులో నిబంధనలు కఠినతరం చేసింది. నిర్ణీత కాలం వరకు రుణాలు చెల్లించకపోతే.. ఆ ఖాతాలను ఎన్పీఏలుగా ప్రకటించి.. వాటికి బ్యాంకులు కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. ఎన్పీఏలకు సంబంధించి కేవలం వడ్డీలు చెల్లించిన మాత్రన.. స్టాండర్డ్ ఖాతాలుగా మార్చొద్దంటూ ఆర్బీఐ ఆదేశించింది. ఆయా ఖాతాల విషయంలో వడ్డీలు, అసలు చెల్లింపులు, వాటికి నిర్ణీత గడవు పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసింది. కొన్ని బ్యాంకులు పాక్షిక వడ్డీ చెల్లిస్తున్న ఖాతాలను ఎన్పీఏలు చూపడంలేదంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ విధంగా స్పందించింది.