NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాజిటివ్ గా సూచీలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగు వెబ్​ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప‌య‌నిస్తున్నాయి. యూఎస్, ఆసియా, యూర‌ప్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతున్న నేప‌థ్యంలో దేశీయ సూచీలు కూడ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మెట‌ల్స్ , ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకులు న‌ష్ట‌ల్లో ట్రేడ్ అవుతుండ‌గా.. ఫార్మా సెక్టార్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. 2:45 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 60,828 వ‌ద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 18140 వ‌ద్ద‌, బ్యాంక్ నిఫ్టీ 8 పాయింట్ల స్వ‌ల్ప న‌ష్టంతో 38,724 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. సోమ‌వారం స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ భారీ ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మెదటి రోజే అప్ప‌ర్ స‌ర్క్యూట్ లో లాక్ అయింది.

About Author