అమరావతి రైతు ఉద్యమంలో పాల్గొనాల్సిందే !
1 min readపల్లెవెలుగు వెబ్ :రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమంలో బీజేపీ నాయకులు పాల్గొనాల్సిందేనని కేంద్ర హాంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతులకు అనుకూలంగా తీర్మానం చేశాక.. దీనిపై మరొక అభిప్రాయం ఎందుకొస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై రాష్ట్ర నాయకులు ఎవరూ మాట్లాడొద్దంటూ తేల్చిచెప్పారు. దీనిపై సరైన సమయంలో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా తిరుపతిలో బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు.