నీటి సమస్య తలెత్తరాదు..!
1 min read
వార్డులను పరిశీలిస్తున్న చైర్మన్, వైస్ చైర్మన్
కమిషనర్‌కు సూచించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
పల్లెవెలుగు, పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య తలెత్తరాదని, ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించాలని నూతన చైర్మన్ వి. వరప్రసాద్, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వి.నరసింహారెడ్డికి సూచించారు. వేసవిలో ఎండలు మండుతున్నాయని, నీటి సమస్యకు శాశ్వితంగా పరిష్కరించాలన్నారు. శుక్రవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ వి. వరప్రసాద్ మాట్లాడుతూ
పట్టణములో నీటి సరఫరాకు అవసరమైన ప్రతి చోటా గేట్ వాల్ ఏర్పాటు చేసి, మూతలను బిగించాలన్నారు. వేసవిలో నీటిసరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ వి. వరప్రసాద్, వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డీఈ సురేంద్ర బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీధర్ మరియు నీటిసరఫరా సిబ్బంది పాల్గొన్నారు.