ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
1 min read
పల్లెవెలుగువెబ్: ఏపీకి మరోసారి వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఉత్తర బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ.. ఈనెల 18న దక్షిణ ఏపీ, ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.