సెంచరీ కొట్టిన టమాట
1 min read
పల్లెవెలుగువెబ్: కూరగాయాల ధరలు ఆకాశనంటుతున్నాయి. ముఖ్యంగా టమాట కిలో ధర రూ.100కు చేరింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తున్నారు. డిమాండ్‌కు సరిపడ పంట దిగుబడి లేకపోవడంతో టమాట ధరలు భారీగా పెరిగాయి. గడిచిన ఐదేళ్లలో ఈస్థాయిలో టమాట ధర పెరగడం ఇదే తొలిసారి. మంగళవారం మదనపల్లె మార్కెట్‌లో మేలు రకం టమాటలు కిలో రూ.100 పలికింది. దీంతో వినియోగదారులు ఏమీ కొనెట్టు లేదు.. ఏమీ తిన్నెట్టు లేదని వాపోతున్నారు. పక్కనున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలలో కూడా టమాట దిగుబడి భారీగా తగ్గడంతో రేట్లు విపరీతంగా పెరగడానికి ఓ కారణమని వ్యాపారస్తులు పేర్కొన్నారు.