పీఓకే ఖాళీ చేయాల్సిందే.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
1 min read
పల్లెవెలుగువెబ్: పీఓకే విషయంలో పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్. ‘దౌత్య విధానాలతో అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణ’ అనే అంశంపై ఐరాసలో చర్చ జరిగింది. భారత్ తరుపున చర్చలో భారత శాశ్వత కౌన్సిలర్, న్యాయ సలహాదారు డాక్టర్ కాజల్ భట్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఐరాస వేదికల్లో భారత్‌పై విషం చిమ్ముతోందని పాక్‌పై మండిపడింది.
ఉగ్రమూకలకు శిక్షణ ఇస్తూ వారికి అన్ని రకాలుగా సహాయం చేస్తున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసంటూ పాక్‌కు చురకలంటించారు. పాక్‌తో సహా పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాదంపై ఎప్పటికీ కఠినంగానే ఉంటామని తేల్చి చెప్పారు. జమ్మూకశ్మీర్‌పై పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకూ కాజల్ భట్ కౌంటర్ ఇచ్చారు. పీఓకే ఇప్పటికీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేని ఆమె తేల్చి చెప్పారు. ముందు పీఓకేను ఖాళీ చేయాలని పాక్‌కు గట్టి హెచ్చరికలు పంపారు. ఒకవేళా పాక్‌తో చర్చలు జరపాల్సి వస్తే అది ఉగ్రవాదంపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు కాజల్ భట్.