రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ
1 min read
పల్లెవెలుగు వెబ్: ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. వివాదాస్పద రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. రైతులకు క్షమాపణ చెప్పారు. తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో రైతుల కష్టాలను చేశానన్నారు. ‘ప్రధాని హోదాలో రైతుల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశా. రైతులకు 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను ఇచ్చాం. దీంతో పంట దిగుబడి గణనీయంగా పెరిగింది. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లలో నగదు జమ చేశాం. లక్ష కోట్లు రైతులకు పరిహారంగా అందజేశాం. రైతుల అభివృద్ధికి ఏం కావాలో అది చేశాం. చిన్న, సన్నకారు రైతుల మేలుకోసమే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాం. అయితే రైతులను ఓప్పించడంలో ముందడుగు వేయలేకపోయాం. ఈ అంశంలో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. అందరికీ ఒకే విషయాన్ని స్పష్టంగా చెపుతున్నా… వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నాం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి… క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుతున్నా. ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి.” అంటూ ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.