బ్రోకర్లకు శుభాకాంక్షలు తెలిపిన రాజాసింగ్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బ్రోకర్లకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రైతులే వ్యవసాయ చట్టాలు కావాలని కోరుతారని చెప్పారు. ప్రధాని మోదీ అన్ని ఆలోచించాకే నిర్ణయం తీసుకుని ఉంటారని తెలిపారు. రైతుల కష్టాలను బ్రోకర్లు సొమ్ముచేసుకుంటున్నారని విమర్శించారు. రైతుల లబ్ధి కోసమే కేంద్రం రైతు చట్టాలు తీసుకొచ్చిందని తెలిపారు. పంటల అమ్మకాల్లో బ్రోకర్ల వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. రైతు చట్టాల అవసరం త్వరలోనే రైతులకు తెలిసి వస్తుందని అన్నారు.