పూర్తిగా ధ్వంసమైన తిరుమల మెట్లమార్గం
1 min read
పల్లెవెలుగు వెబ్: తిరుపతిని వరుణుడు వీడటం లేదు. నిన్న కాస్తింత తెరపించాడో లేదో ఈ రోజు తెల్లవారుజాము నుంచి మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుపతి వాసుల్లో భయాందోళన మొదలైంది. భారీ వర్షం ధాటికి కాలువలు, చెరువలు ఉపొంగుతున్నాయి. తిరుపతి నగరంలో ఎటుచూసిన నీరే కనబడుతుంది. మరోపక్క మొన్నటి జడివానకు తిరుమల అతలాకుతలంమైంది. గతంలో ఎన్నడూ చూడని భీతావహ పరిస్థితి నెలకొంది.
శ్రీవారి మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. 1200 మెట్టు వద్ద నిర్మించిన బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోయింది. తిరుమల సహాయ సిబ్బంది మెట్ల మార్గం, ఘాట్ రూట్‌లో పునరుద్ధరణ పనులు చేపట్టారు. తిరుమలకు కేవలం దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.