NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రిప్టో లాభాలు.. ప‌న్ను క‌ట్టాల్సిందే !

1 min read

పల్లెవెలుగు వెబ్​: క్రిప్టో క‌రెన్సీల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క‌నిర్ణ‌యం తీసుకోబోతోంది. క్రిప్టోకరెన్సీలను ఆదాయ పన్ను చట్టం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు అనూహ్యంగా పెరిగిపోవటంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  ఇందులో భాగంగా క్రిప్టో లాభాలపై పన్ను వసూలు చేసేందుకు గాను ఆదాయ పన్ను చట్టం లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వెల్లడించారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లో ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలో కొన్ని మార్పులు చేయాలని యోచిస్తోందని ఆయ‌న చెప్పారు. ఇప్పటికే కొంతమంది క్రిప్టోకరెన్సీ నుంచి లాభాలను ఆర్జిస్తే దానిపై క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ను చెల్లిస్తున్నారని బజాజ్‌ తెలిపారు. అలాగే క్రిప్టో లావాదేవీలకు సంబంధించి జీఎస్టీ వసూలు చేసే విషయం చాలా స్పష్టంగా ఉందన్నారు.

About Author