పరిశ్రమల ఏర్పాటుకు.. నైపుణ్యం అవసరం..
1 min readపరిశ్రమల శాఖ జిల్లా అధికారి సోమశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు కర్నూలు : పరిశ్రమల ఆవశ్యకత, వాటి అవసరాలు, ఏర్పాటుకు కావల్సిన నైపుణ్యం అత్యవసరమని పరిశ్రమల శాఖ జిల్లా అధికారి సోమశేఖర్ రెడ్డి యువతకు సూచించారు. స్థానిక రాయలసీమ యూనివర్శిటీలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి అవగాహన సదస్సు రెండోరోజు కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పరిశ్రమల అధికారి సోమశేఖర్ రెడ్డి, రూర్ శెట్టి డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ , లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకట నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఒక పరిశ్రమల ఏర్పాటు చేసుకోవటానికి కావలసిన మౌలిక సదుపాయాలు , పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి లభించే వివిధ రకాల స్కీమ్స్ మరియు రాయితీల గురించి, బ్యాంకు వారి ద్వారా సబ్సిడీ రుణాలు ఎలా తీసుకోవాలి, వాటి ద్వారా స్వయం ఉపాధి ఎలా పొందాలి అనే అంశాలు వివరించారు. అనంతరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.హెచ్.విన్సెంట్ మాట్లాడుతూ ఇండ స్ట్రీ వారు మరియు బ్యాంకు వారు చెప్పే విషయాలు, వాటిని భవిష్యతు లో మీరు స్థాపించబయే పరిశ్రమలకు అన్వయించుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఆ తరువాత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ ప్లేసెమెంట్ అధికారి రామకృష్ణ మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.