PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫలించిన రైతుల పోరాటం..

1 min read

పల్లెవెలుగువెబ్​, నందికొట్కూరు : రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ  నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ పిలుపు మేరకు శనివారం  రాత్రి 7 గంటల కు పట్టణంలోని పటేల్ కూడలిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్ నుండి పటేల్ కూడలి వరకు   కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తిని, శక్తిని ప్రతిబింప చేసేలా భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక గొప్ప విజయాన్ని సాధించిన రైతులు దేశ చరిత్రలో నిలిచిపోతారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా  రైతులు చేసిన దీక్షకు వైఎస్ఆర్ పార్టీ బాసటగా నిలిచిందన్నారు. రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిందేనని ఆనాడే స్పష్టంగా చెప్పిన పార్టీ మన వైఎస్ఆర్ పార్టీదేఅని పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పుడు, రైతులకు మద్దతు తెలిపి, వారు చేపట్టిన దేశ వ్యాప్త బందులో వైయస్సార్ పార్టీ భాగస్వామ్యం అయిందని తెలిపారు . రైతు బాగుంటేనే రాష్ట్రమైనా, దేశమైన బాగుంటుందని నమ్మే నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కాబట్టే జాతీయస్థాయి రైతులు ఆందోళనకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలరు  ఉండవల్లి  ధర్మారెడ్డి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్  హాజీ అబ్దుల్ షుకూర్ మియా , సింగిల్విండో చైర్మన్  చందమాల బాలస్వామి , తమ్మడపల్లి విక్టర్ , పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి  డాక్టర్ వనజ, కడుమూరు గోవర్ధన్ రెడ్డి , ఆర్ట్ శ్రీను , జగన్ రఫీ , మహబూబ్ బాషా , సలాం ఖాన్ , తుమ్మలూరు సర్పంచ్ వరప్రసాద్ , వెంకటేశ్వర్ రెడ్డి , ప్రాతకోట వెంకటరెడ్డి , వెంకటరమణ ,లక్ష్మాపురం భూషి గౌడ్ , శాతనకోట వెంకటేష్ , దివాకర్ , దామగట్ల యేసు రత్నం , మల్యాల. శంకరయ్య , కృష్ణ   తదితరులు పాల్గొన్నారు.

About Author