PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

18 కోట్ల మంది ఖాతాదారుల‌కు షాక్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ సర్వర్‌లో భారీ లోపం ఒకటి బయటపడింది. ఈ లోపం వల్ల సుమారు ఏడు నెలల పాటు.. బ్యాంకు తన 18 కోట్ల వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం బయటకి వెల్లడైనట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ ఎక్స్9 తెలిపింది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్‌ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్‌ చేసే అవకాశాన్ని సర్వర్‌లోని ఈ లోపం కల్పించినట్లు ఆ సంస్థ పేర్కొంది.  దీని వల్ల కస్టమర్ డేటా/అప్లికేషన్లు ప్రభావితం కావు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా సర్వర్ షట్ డౌన్ చేసినట్లు పీఎన్‌బీ తెలిపింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్  గత 7 నెలలుగా 180 మిలియన్లకు పైగా ఖాతాదారుల నిధులు, వ్యక్తిగత, ఆర్థిక వివరాలు, నగదు విషయంలో బ్యాంక్‌ రాజీ పడిందని, సైబర్ ఎక్స్9 లోపం కనుగొన్న తర్వాత సిఇఆర్‌టి-ఇన్‌, ఎన్‌సిఐఐపీసి సహాయంతో పీఎన్‌బీకి తెలియజేయడంతో బ్యాంక్ మేల్కొని లోపాన్ని పరిష్కరించిందని సైబర్ ఎక్స్9 వ్యవస్థాపకుడు, ఎండి హిమాన్షు పాఠక్ తెలిపారు. దీంతో పీఎన్బీ ఖాతాదారుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author