బాక్స్ టమోటా.. 1000 రూపాయలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశవ్యాప్తంగా కురుస్తున్న వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. కర్ణాటకలోని కోలారు ఎపిఎంసి మార్కెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. 15 కేజీల టమోటా బాక్సు రూ.వెయ్యికి వేలం పాడడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా టమాట దిగుబడి తగ్గింది. దీంతో టమాట లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల కిందట వరకు టమాట బాక్స్ రూ.250 కంటే తక్కువగానే ఉండేది. గిరాకీ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక కూరగాయల మార్కెట్లలో కేజీ ధర 70 నుంచి 80 వరకు ఉంటోంది.
ReplyForward |