కుట్రతోనే ఇలా చేసిందేమో?: ఎంపీ రామ్మోహన్ నాయుడు
1 min read
పల్లెవెలుగు వెబ్: మూడు రాజధానుల బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. అధికార వికేంద్రీకరణ బిల్లును ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను చూసే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమరావతిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు.