భక్త కనకదాసు అడుగు జాడలో నడుద్దాం..: కలెక్టర్ పి.కోటేశ్వర రావు
1 min read★ శ్రీ భక్త కనకదాసు స్ఫూర్తి ప్రదాత -ఏపీ బిసి కమిషన్ మెంబర్ క్రిష్ణప్ప
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కురువల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసును స్మరించుకుందామని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవం జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ భక్త కనకదాసు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, ఏపీ బిసి కమిషన్ మెంబర్ క్రిష్ణప్ప, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వర్, కార్పొరేటర్లు, డైరెక్టర్ లు, ప్రజా ప్రతినిధులు, కురవ సంఘం ప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ….శ్రీ భక్త కనకదాసు గొప్ప వ్యక్తి అని, ఆ మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. భక్త కనకదాసు వారి గొప్పతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి జన్మదినాన్ని జరపాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనం కోసం భక్త కనకదాసు వెళితే ఆ సమయంలో భక్త కనకదాసును శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనానికి లోనికి పోనియకుంటే… శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విషయం తెలుసుకొని భక్తకనకదాసు దర్శనం చేసుకున్నారని అంతటి మహనీయులు భక్త కనకదాసు అన్నారు. అలాంటి మహనీయులు మహానుభావులు నడయాడిన నేల పై జీవించడం పూర్వజన్మ సుకృతం అన్నారు. భక్త కనకదాసు జీవిత చరిత్ర, గొప్పతనం, మంచి విషయాలు, తత్వాలు అందరూ కూడా చదివి తప్పకుండా పాటించాలన్నారు. ఉన్నత స్థాయి ఎదగాలంటే చదువు మంచి ఆయుధం అని అన్నారు. ప్రతి ఒక్కరూ చదవాలని, ప్రతి ఒక్కరిని చదివించాలనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఏపీ బిసి కమిషన్ మెంబర్ క్రిష్ణప్ప భక్త కనకదాసు జయంతిలో కర్నూలు జిల్లాలో మాదాసి, మదారి కురవ కమ్యూనిటీలు కలవని, పూర్వీకుల నుంచి ఏస్ ఈ కుల సర్టిఫికెట్ ఇచ్చేవారని, ఎస్ ఈ కుల సర్టిఫికెట్ ఇచ్చేందుకు వెరిఫై చేయాలని తమ దృష్టికి తీసుకువచ్చారని ఆ కమ్యూనిటీ పై వెరిఫై చేయిస్తామన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ హాలు అడిగారని కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతకుముందు కురవ సంఘాల ప్రతినిధులు తదితరులు శ్రీ భక్త కనకదాసు గురించి సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి.సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వర్, కార్పొరేటర్లు సత్యనారాయణమ్మ, పరమేశ్, మల్లికార్జున్, మున్నెమ్మ, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట్ రాముడు, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరత్నమ్మ, కురబ సొసైటీ ప్రెసిడెంట్ మురళీమోహన్, కురబ అసోసియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస రావు, జనరల్ సెక్రటరీ ఎం కే రంగస్వామి, మాజీ కార్పొరేటర్ శేషమ్మ, బీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ, జిల్లా కురవ సంఘం ప్రెసిడెంట్ దేవేంద్రప్ప, యువజన సంఘం అధ్యక్షులు కిరణ్, రాష్ట్ర గొర్రెల సంఘం చైర్మన్ వై.నాగేశ్వర్ యాదవ్, కురవ సంఘం ప్రతినిధులు నాగరాజు, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.