పాగా వేసి… పట్టుకుని…
1 min read11 బాక్సుల మద్యం స్వాధీనం, కారు సీజ్
పల్లెవెలుగు, కర్నూలు: తెలంగాణ మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో కర్నూలు సెబ్ స్టేషన్ పోలీసులు పాగా వేసి పట్టున్నారు. వివరాలిలా ఉన్నాయి. అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో శనివారం సెబ్ సీఐ రాజశేఖర్ గౌడ్ నేతృత్వంలో ఎస్ఐ, సిబ్బంది స్థానిక కృష్ణానగర్లో ఏపీ 21 ఏవై 2049 నెంబరు గల డిజైర్ కారును తనిఖీ చేయగా… అందులో 5 బాక్సులలో 240(180 ml)మెక్ డొవెల్ విస్కీ మద్యం సీసాలు,2 బాక్సులలో 96(180 ml) రాయల్ స్టాగ్ విస్కీ మద్యం సీసాలు ,2 బాక్సులలో 96(180 ml) ఒరిజినల్ ఛాయిస్ విస్కీ మద్యం సీసాలు, ఒక బాక్సులో 12(750 ml) మాన్షన్ హౌజ్,ఒక బాక్సులో 12(750 ml) బ్లెండర్స్ ప్రైడ్ మద్యం సీసాలు. మొత్తం 11 బాక్సులలో 456 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామానికి చెందిన రొక్కం చైతన్య కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన డిజైర్ కారు ( AP 21AY 2049 )లో మద్యం సీసాలు ఉండటంతో… అతన్ని అరెస్టుచేసి.. కారును సీజ్ చేసినట్లు సీఐ రాజశేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ దాడులలో ఎస్సై స్వామినాథన్ సిబ్బంది నరసింహులు, నరసింహారెడ్డి,మల్లికార్జున, పీరా, షేక్ షా వలి పాల్గొన్నారు.