మరోసారి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా !
1 min readపల్లెవెలుగు వెబ్ : కృష్టా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక మరోసారి నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ కూడా వైసీపీ కౌన్సిలర్లు విధ్వంసం సృష్టించారు. కొండపల్లి ఎన్నిక రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేరింది. హైకోర్టు తీర్పు వస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని టీడీపీ తెలిపింది. కార్యాలయంలోనే టీడీపీ సభ్యులు, ఎంపి కేశినేని నాని కూర్చొన్నారు. వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బయటకు వెళ్లిపోయారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్నికల అధికారి సునీల్ కుమార్ రెడ్డి సైతం బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సునీల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సర్ది చెప్పినా సభ్యులు తగ్గలేదని.. దీంతో ఎన్నికకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అందుకే ఎన్నికను వాయిదా వేశామన్నారు. మరోవైపు దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నిక నిర్వహించడం చేతకాకపోతే డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అన్నారు.