PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ను వేగవంతం చేయండి :ఎంపీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(జేఎస్‌జీహెచ్‌పీ) కింద గృహ నిర్మాణ సంస్థ సహకారంతో మండలంలో ఇళ్లు నిర్మించుకున్న వారు, ప్రభుత్వం ద్వారా స్థలాలు పొందిన వారు ఓటిఎస్‌  పథకాన్ని వేగవంతం చేయాలని   ఎంపిపి వీరభద్రుడు కోరారు. మంగళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ భవనంలో ఓటిఎస్‌ పథకంపై ఎంపిటీసిలు,సర్పంచ్‌లు,పంచాయతి కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.  సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ  1983 నుంచి 2011 వ‌ర‌కూ వివిధ గృహ‌నిర్మాణ ప‌థ‌కాల ద్వారా రుణాలు తీసుకొని, ఇళ్లు నిర్మించుకున్న‌వారికి, ఒన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా ఆయా ఇళ్లు, స్థ‌లాల‌ను త‌మ పేరుమీద‌ రిజిష్ట‌ర్ చేసుకొనే గొప్ప అవ‌కాశాన్ని ఈ ప‌థ‌కం క‌ల్పిస్తుంద‌ని, త‌ద్వారా దానిపై సంపూర్ణ హ‌క్కులు క‌లుగుతాయ‌ని తెలిపారు. ఈ ఒన్ టైమ్ సెటిల్మెంట్ ప‌థ‌కం క్రింద‌, ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న‌ రుణాన్ని, వ‌డ్డీని పూర్తిగా మాఫీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.  అతి త‌క్కువ రుసుంతోనే, శాశ్వ‌త హ‌క్కును సంపాదించే ఈ ప‌థ‌కం క్రింద, ఎటువంటి రిజిష్ట్రేష‌న్ ఛార్జీల‌ను చెల్లించ‌న‌క్క‌ర‌లేకుండానే, త‌మ గ్రామ‌, వార్డు స‌చివాల‌యంలోనే రిజిష్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు. రిజిష్ట్రేష‌న్ అనంత‌రం త‌మ ఇంటిని లేదా స్థలాన్ని అవ‌స‌ర‌మైతే బ్యాంకులో త‌న‌ఖా పెట్టుకోవచ్చున‌ని, లేదా కొత్త‌గా రుణాన్ని తీసుకోవ‌చ్చ‌ని సూచించారు. అలాగే వీటి మార్కెట్ విలువ కూడా పెరుగుతుందన్నారు. ఈ పధకం ప్రయోజనాలను లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో నోడల్‌ అధికారి వెంకటసుబ్బారెడ్డి,ఏవో చంద్రశేఖర్‌,గృహనిర్మాణ  డిజిటల్‌ ఎంట్రి అధికారి సుగుంధర్‌,ఎంపిటిసిలు,సర్పంచ్‌లు,పంచాయతి కార్యదర్శులు పాల్గొన్నారు.

About Author