పెట్రోల్, డీజిల్ వాహనాలు నిలిపేస్తున్నారా ?
1 min readపల్లెవెలుగు వెబ్: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనల రిజిస్ట్రేషన్ నిలిపివేయడం లేదని, కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ వాహనాలను వినియోగదారులు కొనుగోలు చేయడానికి అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే, విమానయాన ఇంధనంలో 50 శాతం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున ఎలక్ట్రికల్ వెహికల్ అమ్మకాలు పెరిగాయని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నానని గడ్కరీ అన్నారు. దేశంలో 250 పైగా స్టార్టప్‌లు ఎలక్ట్రిక్-వాహనాల అభివృద్ది కోసం పనిచేస్తున్నాయని, దీంతో ఈవీల తయారీ ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ReplyForward |