ఆటగాళ్ల తిండి పై ఆంక్షలా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : నవంబర్ 25 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల తిండి పై వివాదం నెలకొంది. బీసీసీఐ ఈ అంశం పై స్పష్టతనిచ్చింది. బీసీసీఐ అధికారి అరుణ్ ధమాల్ దీనిపై స్పందించారు. ఆటగాళ్ల ఆహార అలవాట్ల పై బీసీసీఐ జోక్యం చేసుకోదని ప్రకటించారు. ఆటగాళ్ల డైట్ ప్లాన్ కు సంబంధించి నిబంధనలు విధించలేదని తెలిపారు. ఆటగాళ్లు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చని , అది శాఖాహారమా ? .. మాంసాహారమా ? అనేది వారిష్టమని తెలిపారు. కాన్పూర్ వేదికగా జరగనున్న తొలిటెస్టులో ఆటగాళ్ల మెనూ నుంచి ఆవు, పంది మాంసాలతో కూడిన ఆహారాన్ని నిషేధించడంతో పాటు.. హలాల్ చేసిన మాంసాన్నే ఆహారంగా అందించనున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో పలువురు విమర్శలు చేశారు. ఆటగాళ్ల తిండిపై ఆంక్షలు ఏంటని ప్రశ్నించారు.
ReplyForward |