PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంట చేస్తుండగా.. గ్యాస్ లీక్​.. రెండు గుడిసెలు దగ్ధం

1 min read

* భయంతో పరుగులు తీసిన కాలనీవాసులు..

* తృటిలో తప్పిన పెను ప్రమాదం.. * సర్వం కోల్పోయిన బాధితులు..

పల్లెవెలుగు వెబ్​, రుద్రవరం: వంట చేస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్​ లీకై.. గుడిసెలు దగ్ధమైన ఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ బుజ్జి పద్మావతి కుటుంబ సభ్యులు ఉండటానికి సొంత ఇల్లు లేకపోవడంతో మండల పరిషత్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న పాడుబడిన ప్రభుత్వ క్వార్టర్స్లో నివాసం ఏర్పర్చుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బుజ్జి కుటుంబంతో పాటు మరికొందరు కుటుంబాలు కాలనీలో నివాసముంటున్నారన్నారు..

బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో బుజ్జి భార్య పద్మావతి వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి గుడిసె అంటుకోవడంతో కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు.  కేకలు విన్న చుట్టుపక్కల వారు మంటలను చూసి భయంతో దూరంగా పరుగులు తీశారు. గ్యాస్ లీకై మంటలు వ్యాపించి సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అప్రమత్తమైన కాలనీవాసులు దూరంగా పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది.  పద్మావతమ్మ గుడిసెతోపాటు పక్క గుడిసెకు నిప్పు అంటుకోవడంతో రెండు గుడిసెలు కాలిపోయాయి.  అగ్నిమాపక సిబ్బంది మంటలు వచ్చి మంటలు ఆర్పి వేశారు. అప్పటికే బట్టలు, ధాన్యం, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయని, దాదాపు రూ. 2 లక్షలు ఆస్తినష్టం వాటిల్లిందని బాధిత కుటుంబీకులు తెలిపారు.

About Author