వైఎస్సార్ భూమి హక్కు- భూ రక్ష రీ సర్వే :ఆర్డీఓ
1 min readపల్లెవెలుగు వెబ్, చెన్నూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూ రక్ష రీ సర్వే కి సంబంధించి అనుకున్న లక్ష్యాలను త్వరగా తిన పూర్తిచేయాలని ఆర్డీవో ధర్మ చంద్ర రెడ్డి అన్నారు, బుధవారం మండలంలోని కొక్కరాయపల్లి పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన చేపట్టిన వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష రీ సర్వే నీ ఆయన పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న విధంగా లక్ష్యాలను పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన మండల సర్వేయర్ సోమశేఖర్ కు సూచించారు , అలాగే మండలంలోని రామన పల్లె సచివాలయాన్ని సందర్శించి అక్కడి సచివాలయ సిబ్బందితో ఆయన మాట్లాడారు, గ్రామ సచివాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు, అనంతరం కనపర్తి గ్రామ లే అవుట్ లో ప్రజలకు ఇచ్చిన ఇంటి స్థలాల ను ఆయన పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన తాసిల్దార్ అనురాధ కు పలు సూచనలు సలహాలు ఇవ్వడంతోపాటు, ఎక్కడైనా కొత్తగా లే అవుట్లను పరిశీలించాలని ఆయన తాసిల్దార్ అనురాధ కు తెలియజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ శాశ్వత భూమి హక్కు – భూ రక్షా రీ సర్వేను అనుకున్న విధంగా అనుకున్న లక్ష్యానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పట్టుదలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు కావాలని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో, వీఆర్వోలు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.