దీక్షకు దిగిన టీడీపీ నేత వర్ల రామయ్య
1 min read
పల్లెవెలుగు వెబ్: టీడీపీ నేత వర్ల రామయ్య తన సతీమణితో కలిసి దీక్ష చేపట్టారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబునాయుడు కుటుంబాన్ని వైసీపీ నేతలు కించపర్చినందుకు నిరసనగా తన ఇంట్లో దీక్షకు కుర్చున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన దీక్ష, రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతుందని రామయ్య తెలిపారు. వైసీపీ నేతల తీరు రోజురోజుకు మితిమీరిపోతుందని విమర్శించారు. వెంటనే చంద్రబాబు కుటుంబానికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.