ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి
1 min read
పల్లెవెలుగు వెబ్: చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ స్థాయిలో వరదలు వచ్చాయని మండిపడ్డారు. భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వానికి ముందే తెలిసినా.. ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పలు ప్రాజెక్టుల మరమతుల విషయంలోనూ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యహరించిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఫించ, అన్నమయ్య రిజర్వాయర్లకు అదనపు గేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. తిరుపతిలోని రాయల చెరువుకు ఈ స్థాయిలో నీరు రావడం గతంలో ఎన్నడూ చూడలేదని.. అధికారుల తప్పిదాలు ప్రజలకు శాపంగా మారాయి అని చంద్రబాబు విమర్శించారు. మానవ తప్పిదాలపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.