నెటిజన్ ప్రశ్న: ఆర్థిక శాస్త్రం తెలియదంటూ చురకలు
1 min read
పల్లెవెలుగు వెబ్: ప్రధాని మోదీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ఆప్ఘన్ సంక్షోభంపై కేంద్రం తీరు సరిగా లేదని మండిపడ్డారు. పెగాసస్ స్పైవేర్‌తో జాతీయ భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో జమ్ముకశ్మీర్ చీకట్లో మగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జిని పొగడ్తలతో ముంచెత్తారు సుబ్రహ్మణ్య స్వామి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో నిఖార్సైన వ్యక్తిగా మమతను కొనియాడారు. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావుల్లా తాను అనుకున్నదే చెప్పి, చెప్పిందే చేసే నాయకురాలని కీర్తించారు. దేశంలో ధరల పెరుగుదలపై ఓ నెటిజన్ సుబ్రహ్మణ్య స్వామిని ప్రశ్నించగా… ఆయనకు (ప్రధాని) ఆర్థిక శాస్ర్తం తెలియదంటూ చురుకలంటించారు.