వెబ్ సిరీస్ చూశాడని.. మరణశిక్ష !
1 min readపల్లెవెలుగు వెబ్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఆ దేశంలో ఆయన మాటే శాసనం. గీత దాటింది ఎవరైనా కఠిన శిక్ష తప్పదు. అలాంటి దేశంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న `స్క్విడ్ గేమ్` ను చూసినందుకు ఓ విద్యార్థికి మరణ శిక్ష విధించాడు. ఆ వెంటనే శిక్షను అమలు చేస్తూ ఆ వ్యక్తిని కిరాతకంగా కాల్చి చంపింది ఉత్తర కొరియా సైన్యం. చైనా సర్వర్ల నుంచి సిరీస్‌ను డౌన్‌లోడ్ చేసి వీక్షించాడని, అంతటితో ఆగకుండా ఫ్లాష్ పెన్‌డ్రైవ్‌లలో కొందరు విద్యార్థులకు కాపీలను అమ్ముకున్నాడని ప్రభుత్వం ఆరోపించింది.ఇక ఈ వ్యవహారంలో ఓ విద్యార్థికి జీవిత ఖైదు విధించారు. సిరీస్ చూసిన మరో ఆరుగురికి, సదరు స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించాడు కిమ్. .
ReplyForward |