ఓటిఎస్ తో ఇంటి పై సంపూర్ణ హక్కు
1 min readపల్లెవెలుగు వెబ్, మిడుతూరు: ఓటిఎస్ ద్వారా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు ఇంటి పై సంపూర్ణ హక్కు పొందవచ్చని ఎంపీడీవో జి ఎన్ ఎస్ రెడ్డి, తహసిల్దార్ సిరాజుద్దీన్ అన్నారు. గురువారం మండలంలోని కడుమూరు గ్రామ ప్రజలకు ఓటీఎస్‌పై అవగాహన కల్పించారు. 1983 నుంచి 2011 వరకు గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరు కూడా పదివేల రూపాయలు చెల్లించి శాశ్వత గృహ హక్కు పత్రం పొందాలని సూచించారు. బైరాపురం గ్రామంలో ఒకరికి ఓ టి యస్ శాశ్వత ధ్రువ పత్రమును పంచాయతీ కార్యదర్శి ఎం రవీంద్రబాబు లబ్ధిదారునికి అందజేశారు. అలాగే పీర్ సాహెబ్ పేటలో ఒకరికి మాసపేట గ్రామంలో ఒకరికి శాశ్వత గృహ హక్కు పత్రాలను అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.