మూడో డోసు తప్పనిసరి.. లేకుంటే మూడో దశను అడ్డుకోలేం
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏ టీకా అయినా రెండు డోసులు తీసుకున్న ఆర్నెల్ల తర్వాత తప్పనిసరిగా బూస్టర్ డోసు తీసుకోవాలని ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రెండు డోసులు ఇచ్చే ప్రక్రియను కొనసాగిస్తూ.. మూడో డోసు పంపిణీ ప్రారంభించాలని అన్నారు. అలా అయితేనే భారత్ లో మూడో డోసు ఉధృతిని తగ్గించగలమని అన్నారు. జనాలు ఎక్కువగా గుమిగూడిన ప్రదేశాల్లోనే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. రెండు డోసుల టీకా తీసుకున్న.. కరోన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయొద్దని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.