PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట‌మోట ధ‌ర‌లు ఎప్పుడు త‌గ్గుతాయంటే ?

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ట‌మోట ధ‌ర‌లకు రెక్క‌లొచ్చాయి. కిలో 130 నుంచి 150 పలుకుతోంది. అవ‌స‌రానికి త‌గ్గ స‌ర‌కు లేక‌పోవ‌డంతో ఈ ప‌రిస్థితి నెల‌కొంది. ఏపీ, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌ల్లో భారీ ఎత్తున వ‌ర్షాలు ప‌డ‌టంతో టమోట పంటకు పెద్ద ఎత్తున న‌ష్టం క‌లిగింది. ఈ నేప‌థ్యంలో ట‌మోట ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో ధ‌ర‌లు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. టమోట ధ‌ర‌లు భారీగా ఉన్నా.. రైతుల‌కు మాత్రం ల‌బ్ధి చేకూరడం లేదు. చాలా పంట వ‌ర్షానికి దెబ్బ‌తిన‌డంతో కేవ‌లం ప‌ది శాతం లోపు రైతులు మాత్ర‌మే ల‌బ్ధి పొందుతున్నారు. 90 శాతం పంట దెబ్బ‌తినింది. అటు రైతుల‌కు కూడ పెద్దగా లాభం వచ్చే ప‌రిస్థితి లేదు.  మరో రెండు వారాల్లోనే ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతుండగా.. ఓ పరిశోధన మాత్రం మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాలే ఈ పరిస్థితికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సెప్టెంబరు నుంచి కురుస్తున్న వర్షాలతో ఈ రాష్ట్రాల్లోని నర్సరీల్లో టమాటా నారు పూర్తిగా దెబ్బతిందని, దీంతో.. డిమాండ్‌కు తగ్గ స్థాయిలో మార్కెట్‌కు టమాటా రావడం లేదని అంటున్నారు.
ఉత్త‌రాది నుంచి వ‌స్తే..
మరో రెండు వారాల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి తాజా టమాటా పంట వస్తుందని, అప్పుడు ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని కేంద్రం చెబుతోంది. ‘‘ఉత్తరాది రాష్ట్రాల్లో పండిన టమాటాలు.. డిసెంబరు తొలివారం నుంచి మార్కెట్లలోకి వస్తాయి. దీంతో.. ధరలు క్రమంగా తగ్గుతాయి. డిసెంబరు రెండో వారం తర్వాత మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే.. మరో రెండు నెలల పాటు టమాటా ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని తాజాగా జరిగిన ఓ పరిశోధన తేల్చింది. టమాటా దిగుబడి అధికంగా ఉండే నాలుగు రాష్ట్రాల్లో ఈసారి పంట దిగుబడి భారీగా పడిపోయిందని, ఉత్తరాది రాష్ట్రాల నుంచి పంట అందుబాటులోకి వచ్చినా.. అది కనీస అవసరాలకు సరిపోదని చెప్పింది. దీంతో మ‌రో రెండు నెల‌లు టమోట ధ‌ర‌లు త‌గ్గే ప‌రిస్థితి లేదంటున్నారు.

About Author