ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్లు సంచలన నిర్ణయం
1 min read
పల్లెవెలుగు వెబ్: తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆప్ఘాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో వ్యాపారస్తులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో శాంతిభద్రతలను పటిష్టం చేసే పనిలో పడ్డారు తాలిబన్లు. ఈ క్రమంలో వ్యాపారులు తమ స్వీయ రక్షణ కోసం ఆయుధాలను వెంట తీసుకెళ్లొచ్చని తాలిబన్లు ప్రకటించారు. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖోస్టాయ్ తెలిపారు.