డేంజర్ జోన్‌లో ఢిల్లీ.. వాటికి మాత్రమే అనుమతి
1 min read
పల్లెవెలుగు వెబ్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చింది. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఢిల్లీ నగరంలోకి కేవలం సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. అలాగే డిసెంబర్ 3వ తేదీ వరకు అన్ని రకాల డీజిల్, పెట్రోల్ వానాల రాకపోకలపై పూర్తి నిషేధం విధించారు. తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి వేగం తగ్గడం కారణంగా ఢిల్లో గాలి నాణ్యత మరింత క్షీణించింది.
వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 386గా నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. మరో వైపు, ఢిల్లీలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు నవంబర్ 29 నుంచి తిరిగి తెరవడానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే భవన నిర్మాణ పనులపై నిషేధం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.