NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొడాలి నాని ఏం చేస్తాడు? పెద్ద మగాడా?: టీడీపీ నేత యరపతినేని

1 min read


పల్లెవెలుగు వెబ్: అసెంబ్లీ ఘటన తరువాత వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. చంద్రబాబు సెక్యూరిటీని వదిలి వస్తే.. తామేంటో చూపిస్తామన్న కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత యరపతినేని స్పందించారు. కొడాలి నాని ఏం చేస్తాడు? పెద్ద మగాడా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉందన్నారు.
కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను వారి కుటుంబ సభ్యులే అస్యహించుకుంటున్నారని.. వారిలాగే తాము కూడా మాట్లాడగలమన్నారు. అయితే తమకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. గత రెండున్నరేళ్లలో 80 మందికి పైగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని, ఏడుగురిని చంపేశారని యరపతినేని చెప్పారు. రాష్ట్రంలో నియంత, అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

About Author