ఒకట్రెండు రోజులు అమ్ముడయ్యే బ్లాక్ టికెట్లను పరిగణలోకి తీసుకుంటే ఎలా?: సురేష్ బాబు
1 min read
పల్లెవెలుగు వెబ్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆన్లైన్ టికెటింగ్ విధానంపై స్పందించారు. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తే ఆ ప్రభావం ఎగ్జిబిషన్ పరిశ్రమపై తీవ్రంగా పడుతుందన్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు మనుగడ సాగించలేవని అభిప్రాయపడ్డారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదని.. నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.“మార్కెట్లో ప్రతి ఉత్పత్తికి ఓ ధర ఉంటుంది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడం తెలివైన పని కాదు. ఒకట్రెండు రోజులు మాత్రమే అమ్ముడయ్యే బ్లాక్ టిక్కెట్ల విషయాన్ని పరిగణలోకి తీసుకోని టికెట్ల ధరలను తగ్గించడం సమంజసం కాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురిచేసింది’’. అని సురేష్ బాబు వ్యాఖ్యానించారు. కాగా, సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన చిత్రాలు, ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాం వేదికగానే విడుదల అయ్యాయి. దీంతో సురేష్ బాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన ఓటీటీకే మొగ్గు చూపారు. తాను, తన భాగస్వాములు నష్టపోవడానికి సిద్ధంగా లేమని సురేష్ బాబు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.