వ్యవసాయంపై కేంద్రం కీలక నిర్ణయం
1 min read
పల్లెవెలుగు వెబ్: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రధాని ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, కనీస మద్దతు ధర తదితర అంశాలపై కమిటీ చర్చించి నిర్ణయాలను సిఫార్సు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కమిటీలో రైతు సంఘం నాయకులు కూడా ఉంటారని పేర్కొన్నారు.
రైతులు ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర డిమాండ్ కూడా ప్రభుత్వం నెరవేర్చిందని.. దీంతో ఇంకా ఆందోళన చేయడం సరికాదని నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించి.. జాతికి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే.