కొత్తవి రాక.. ఉన్నవి పోక.. ఉద్యోగాలు లేక: లోకేష్
1 min read
పల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందురావడం లేదని.. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని లోకేష్ విమర్శలు గుప్పించారు. టాటా గ్రూప్ సెమీకండక్టర్ పరిశ్రమను తెలంగాణ లేదా తమిళనాడు రాష్ట్రానికి తరలించాలని యోచిస్తోందని ఆరోపించారు. లులూ గ్రూప్ కూడా ఏపీకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని లోకేష్ తెలిపారు. ఏపీకి కొత్త పరిశ్రమలు రాక? ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని లోకేష్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిని జగన్ సర్కార్ రద్దు చేయడంతో దాదాపు 10 వేల ఉద్యోగాలు కోల్పోయామని అన్నారు. దీంతో ఏపీ ఆర్థికంగా చితికిపోతుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.