NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లెవెలుగు వెబ్​ : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ మేర‌కు జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలిచ్చారు. జనగణన పూర్తయ్యేలోగా విభజనకు సంబంధించి.. ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసి నోటిఫికేషన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు. జనగణన ఉన్నప్పుడు ప్రక్రియ చేపట్టడం సరికాదని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే..  ఈలోగా ప్రాథమిక కసరత్తు, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ఏపీలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో గ‌తంలో వైసీపీ ప్రకటించింది. అరకు పార్లమెంటును రెండు జిల్లాలగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author