PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం చివరివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు కుంకుమలు దీపదానాలు చేసి సారె సమర్పించుకున్నారు. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచి స్వామిఅమ్మవార్ల నిత్య కైంకర్యాల అనంతరం దర్శనాలు ప్రారంభించినట్లు ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు స్వామివారికి గర్బాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలతో పాటు అమ్మవారికి కుంకుమార్చనలు మరియు వృద్థమల్లికార్జున స్వామికి బిల్వార్చనలు చేసుకున్నారు.

స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని గర్బాలయ అభిషేకాలను, స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం వేడిపాలు మంచినీరు బిస్కెట్లు అల్పాహారాలు అందిస్తూ అన్నప్రపాద వితరణ చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించుకునే వారు గంగాధర మండపం, ఉత్తరమాడవీధిలో మాత్రమే వెలిగించుకుని ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు. దేవస్థాన సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా మేలగాలని, వారికి కావలిసిన వివరాలను తెలియజేయాలని ఈవో అన్నారు. అదే విధంగా దీపదానాలు, సాలెగ్రామదీప దానాలు, కార్తీక సంకల్ప పూజల పేరుతో భక్తుల నుండి డబ్బులు వసూలు చేసే వారిపై తమకు ఫిర్యాదులు చేయాల‌ని కోరారు.

About Author