ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం లోని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు .అనంతరం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో తొలి సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిబాపూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడు. తన బాల్యంనుండే విద్య పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి జ్యోతిరావు పూలే కి బాల్యంలోనే వివాహం చేశారు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే కి చదువు నేర్పి, బాలికలు, బడుగుల కోసం పాఠశాల ప్రారంభించి, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువుగా భావించిన మహాత్మ జ్యోతిరావు పూలే 131 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సామాజిక విప్లవ జోహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డివిజన్ కార్యదర్శి గోపాలకృష్ణ , మండల కార్యదర్శి ,నాగన్న , కలాం ఆటో యూనియన్ నాయకులు శేఖర్.అఖిల భారత మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బి బి, ఐసా నందికొట్కూరు డివిజన్ కార్యదర్శి రంగస్వామి నాగన్న,వెంకట్, సాజిత్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.