ఒంటిపూట బడి ఎప్పటి నుంచి అంటే ?
1 min readఅమరావతి: ఏపీలో విద్యాసంస్థలు ఒంటిపూట బడి నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఒంటిపూట బడులకు విద్యాసంస్థలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 1 వతరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు విద్యాసంస్థలు తరగతులు నిర్వహించాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఉంటుందని తెలిపారు. కరోన విజృంభణ, ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇటీవల పాఠశాలల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.