ఆర్డర్లు తీసుకోం.. సమ్మె బాటలో స్విగ్గీ డెలివరీ బాయ్స్
1 min readపల్లెవెలుగు వెబ్: స్విగ్గి డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆర్డర్లు తీసుకోబోమని స్పష్టం చేశారు. పెరిగిన పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలతో ఇంటి అద్దె , పిల్లల స్కూలు ఫీజులు కూడ చెల్లించలేకపోతున్నామని తెలిపారు. స్విగ్గి యాజమాన్యం గతంలోలాగా 35 రూపాయల బేస్ ఫెయిర్ చెల్లించాలని, దూర ప్రాంతాలకు డెలివరీ చేస్తున్నప్పుడు ఇస్తున్న రూ. 6ను రూ.12గా పెంచాలని కోరారు. థర్డ్ పార్టీలకు ఆర్డర్లు ఇవ్వకుండా సంస్థ కోసం పనిచేస్తున్న వారిని ఆదుకోవాలని కోరారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ఆర్డర్లు తీసుకోబోమని స్పష్టం చేశారు.
ReplyForward |