మహానంది దేవస్థానంలో వన్ మెన్ ఆర్మీ
1 min readపల్లెవెలుగువెబ్, మహానంది: కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం లో వన్ మెన్ ఆర్మీ కొనసాగుతుంది. దేవస్థాన కార్యాలయంలో ముగ్గురు సూపరింటెండెంట్లు ఉండాల్సి ఉండగా కేవలం వన్ మెన్ ఆర్మీ మాదిరిగా ఒకే ఒక్కడు విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం డిపార్ట్మెంట్ నుంచి ఒక సూపరింటెండెంట్ దేవస్థానం నుండి ఇద్దరు విధులు నిర్వహించే వారు . నేడు గత కొంతకాలం నుంచి ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది .ఈ క్షేత్రంలో దీంతోపాటు మరో రెండు సూపరింటెండెంట్ పోస్టు లో భాగంగా ఒక సూపరిండెంట్ విధులు నిర్వహిస్తున్నారు .మరో సూపరిండెంట్ గత మూడు నెలల నుంచి సెలవులో ఉన్నారు ..ఒకే ఒక్క సూపరిండెంట్ విధులు నిర్వహిస్తున్నారు .సెలవులో ఉన్న వారి స్థానంలో ఎవరిని నియమించుకోవడంచర్చనీయాంశంగా మారింది.దీంతో పలు ఫైలు పెండింగ్లో ఉన్నాయి .దీంతో ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారినట్లు తెలుస్తుంది.