కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మ !
1 min readపల్లెవెలుగు వెబ్ :కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో బాయిల్డ్ రైస్ కొనించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. వరి విషయంలో కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 750 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను 100శాతం ముంచుతుందని కేసీఆర్ ఆరోపించారు.